పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను అధికార వైసీపీ భయభ్రాంతులకు గురిచేస్తోందని ప్రస్తుత ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. విశాఖపట్నం నగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఉద్యోగులను బయటకు వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తున్నారని ఆరోపించారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.