రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో బుధవారం ఓ జంట తమ ఐదుగురు పిల్లలతో కలిసి కాలువలో దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మొత్తం ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇది ఆత్మహత్య కేసుగా తెలుస్తోంది. ఏడు మృతదేహాలను కాలువ నుంచి బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీలో ఉంచినట్లు పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ కాంగ్ తెలిపారు. మృతులను శంకర్లాల్ (32), అతని భార్య బద్లీ (30), వారి కుమార్తెలు రమీలా (12), కెసి (10), జాన్వీ (8), కుమారులు ప్రకాష్ (6), హితేష్ (3)గా గుర్తించారు. వారు గలీఫా గ్రామ నివాసితులని సంచోర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నిరంజన్ ప్రతాప్ సింగ్ తెలిపారు.శంకర్లాల్ అనే రైతు తన భార్యతో విభేదాలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆమె తెలిపారు.