మహనీయుడు నందమూరి తారకరామరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని హిందూపురం టీడీపీ నాయకులు మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం గంటవారి పల్లెలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై బుధవారం స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విగ్రహాన్ని ద్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. మహనీయుల విగ్రహాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వెంటనే దీనికి కారకులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.