శ్రీకాకుళంలో గత నెల ఫిబ్రవరి 25, 26 తేదీలలో జరిగిన ఐఎఫ్టియూ 9వ రాష్ట్ర మహాసభలలోఅనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గుంతకల్లు పట్టణానికి చెందిన బి. సురేష్ ను రాష్ట్ర కమిటీ సభ్యుడి గా ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఆ మేరకు ఆయన బుధవారం పత్రిక లకు విడుదల ఓ ప్రకటనలో పేర్క న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఐఎఫ్టి యూ 9వ రాష్ట్ర మహాసభలు ఘనం గా జరిగాయని అన్నారు. ఈ సభల లో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాల గురించి, హిందూ మతోన్మాదం గురించి, మోడీ ఫాసిస్ట్ పరిపాలనతో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదం ఎంత గా దెబ్బతిందో చర్చించడం జరిగిం దన్నారు. కేంద్రం లోని మోడీ సర్కారు కార్పొరేట్ కంపెనీలకు, ఆదాని, అంబానీ కంపెనీలకు ఊడిగం చేస్తూ శ్రామిక వర్గ ప్రజల హక్కులను అణిచివేస్తున్నది చర్చిం చారని అన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడాన్ని మోడీ ప్రభుత్వ పరిపాలన మీద తీవ్రంగా మాట్లాడడం జరిగిందన్నారు. తిరుపతిలో ఏప్రిల్ 16, 17, 18 తేదీ లలో జరుగనున్న ఐఎఫ్టియు జాతీయ మహాసభలలో కేంద్రం విధానాలపై సమగ్రంగా చర్చలు జరిపి జాతీయ స్థాయిలో పోరాటాలకు కార్యచరణ రూపొందిస్తారన్నారు. తనతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన ఏసురత్నం ను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రన్నారు.