మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో తరతరాలుగా స్వామి వారి పల్లకి మోసే బోయలకు గురువారం నూతన వస్త్రాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు లు పాల్గొని నగరానికి చెందిన హేమలత ఆయిల్ ట్రేడర్స్ అధినేత కందుకూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను బోయ కులస్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా దాత గోపాలకృష్ణ ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందించారు.