ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి నా మద్దతు.. వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 12:11 PM

కొంతకాలం నుంచి మైలవరంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఇటీవల వీరిద్దరి మధ్య వివాదాలకు సీఎం వైఎస్ జగన్ ముగింపు పలికారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తోనూ, మంత్రి జోగి రమేష్ తోనూ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. తన చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇలా మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా అమరావతికే నా మద్దతు అని , కానీ పార్టీ నిర్ణయాన్ని మేము అడ్డు చెప్పలేం. పార్టీ నిర్ణయం ఫైనల్ అని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటలే ఫైనల్ అని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తుంది అని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com