రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డిని శింగనమల సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి సర్జన్ డాక్టర్ రమణ నాయక్ గురువారం గౌరవప్రదంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి తమకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిర్థించడం తో పాటు శింగనమల మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందరికీ కూడా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలియజేశారు.