అదానీ గ్రూపులో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెబీ నిబంధనలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్స్ లో ఏమైనా అవకతలకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించింది. అలాగే విచారణ నిమిత్తం సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ సప్రే నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.