వంట గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచినందున మేడికొండూరులో గురువారం సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భముగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొట్ల రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణ , గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భం నుండి ఉచిత గ్యాస్ నిక్షేపాలు లభ్యమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సయ్య సుభాని ఎస్కే ఆదంషఫీ, ఎస్ కే సాదిక్ , పెద్ద సుభాని, ఎంఉమామహేశ్వరరావు పాల్గొన్నారు