అత్తిపండు లేదా అంజీర్ లో ఫైబర్, జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అత్తి పండును తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే ఎండిన అత్తి పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తక్కువగా తినాలి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకలు, కండరాలు బలపడతాయి.