నాదెండ్ల మండలంలో వైయస్సార్ పెన్షన్ కానుక సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ బుధవారం 75 శాతం పూర్తయింది. మండల పరిధిలో 9348 మంది లబ్ధిదారులకు గాను రూ. 2, 57, 85, 250 నగదు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు 75 శాతం పంపిణీ చేశారు. తెల్లవారుజామున వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేశారు.