పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు సచివాలయం లను మున్సిపల్ కమిషనర్ వి. వి. నరసింహారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ ను, సచివాలయం సిబ్బంది యొక్క మూమెంట్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సచివాలయం నందు జరుగుతున్న ఆధార్ సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది తో కలిసి ఆస్తి పన్ను వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. పన్ను వసూళ్ల ను వేగవంతం చేసి వందశాతం వసూళ్ల లక్షాలను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఘునాథ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.