నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలచంద్ర పేర్కొన్నారు. బుధవారం వేంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫౌండేషన్, చైతన్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత డ్రైవింగ్ శిక్షణ అభయ పౌండేషన్ అధ్యక్షుడు బాలచంద్ర ప్రారంభించారు. అలాగే 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు మోటివేషన్ క్లాసులపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుంటే సులువుగా డ్రైవింగ్ నేర్చుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా మండలి అధ్యక్షుడు రామాంజనమ్మ, రీడో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.