టమాట తినడానికే కాదు ముఖాన్ని మిలమిల మెరిపిస్తుంది కూడా. టమాటా రుబ్బులో 2 స్పూన్ల గంధాన్ని కలిపి పేస్ట్ లా చేయాలి. అందులో పాలు పోసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ లోపు మీ ముఖాన్ని బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ ను మీ ముఖం, మెడపై అప్లై చేసి బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం మెరిసిపోవడంతో పాటు ముఖంపై మచ్చలు తగ్గుతాయి.