ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 03:41 PM

తల్లి, అక్క మందలించారన్న మనస్థాపంతో కాజా బాషా అనే యువకుడు మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఆగిరిపల్లి మండల పరిధిలోని ఎస్‌ఏ పేట గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్‌. చంటిబాబు తెలిపారు. గ్రామానికి చెందిన దూదేకుల సుల్తానా గర్భవతి అయిన తన కుమార్తెను చూసేందుకు కుమారుడు కాజా బాషాతో గత నెల 27న విజయవాడ వెళ్లారు. అక్కడ కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో జరిగిన చిన్నపాటి గొడవలో తల్లి, సోదరి బాషాను మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాషా 28న ఎస్‌.ఏ.పేట వచ్చి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com