ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, బందోబస్తు ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్మీనా సమీక్షించారు. మీనా మాట్లాడుతూ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యా త్మక పోలింగ్ స్టేషన్లుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.