వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసిందెవరో సీఎం జగన్ స్వగ్రామం పులివెందులలో ఏ పిల్లోడిని అడిగినా చెబుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన కడప ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడం కోసం జగన్‌రెడ్డి సాగిస్తున్న నియంత పోకడలు తారస్థాయికి చేరాయన్నారు. ఇంతలా దిగజారిన జగన్ లాంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో చూడలేదన్నారు.