ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌కు నెమలి పించాల దండ, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 03:44 PM

పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్‌ పల్లెల్లో నిద్రించకుండా, విశాఖపట్నానికి వచ్చి పడుకుంటారట అని వైసీపీ ఎంపీ  రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. పల్లె నిద్రలో భాగంగా ముఖ్యమంత్రి ఏ పల్లెకు వెళ్లినా అక్కడ వృక్షాలన్నింటినీ నరికివేసే ప్రమాదం ఉందని చెప్పారు. తెనాలి సభలో జగన్‌కు వేసిన నెమలి పించాల దండ కోసం 20నుంచి 25 నెమళ్ల ఈకలు పీకి ఉంటారన్నారు. జాతీయ పక్షి అయిన నెమలిని హింసించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరమని, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని రఘురామ డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com