ఒడిశాలో భూకంపం సంభవించింది. దక్షిణ కోరాపుట్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5.05 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు తూర్పున 129 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరగలేదు. అయితే భూకంప తీవ్రతకి భయాందోళనకు గురైన ప్రజలు బయటకి పరుగులు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa