లింగసముద్రం మండలం విఆర్ కోట గ్రామ సమీపం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో కందుకూరు సెబ్ సీఐ డి వెంకటేశ్వర్లు ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం కాపుగాసి రెండు ట్రాక్టర్లను స్వాధీన చేసుకున్నారు. గంగపాలెం గ్రామానికి చెందిన బాలచంద్ర, గుడిపూడి మహేంద్ర ల టాక్టర్లు సీజ్ చేసి ఇసుక ట్రాక్టర్లును లింగసముద్రం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించారు.