వేసవిలో సపోటా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు 2, 3 సపోటా పండ్లు తింటే అలసట తగ్గుతుందని, దీనిలోని కాల్షియం ఎముకలు బలంగా ఉండేలా చేస్తుందంటున్నారు. రోగ నిరోధక శక్తి మెరుగుపడి, దృష్టి లోపాలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. రక్తహీనత ఉన్న వారు సపోటా తింటే సమస్య దరి చేరదని అంటున్నారు. మలబద్దకం సైతం నివారిస్తుందని చెబుతున్నారు.