చీమకుర్తిలోని కెనాల్లో పడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. ఒంగోలులోని సుజాత నగర్ కు చెందిన నాగసాకి కృష్ణ గురువారం చీమకుర్తిలోని కెనాల్ వద్దకు వెళ్ళాడు. అయితే ప్రమాదవశాత్తు కృష్ణ కాలువలో పడి మృతి చెందాడు. దీంతో పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, సిబ్బంది సురేష్, శ్రీహరి, దేవకుమార్, బాల చైతన్యలు యువకుడిమృతదేహాన్ని అతి కష్టంపై బయటకు తీశారు.