తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి పి. శ్యాంప్రసాద్ రెడ్డి గెలుపునకు అవలంబించాల్సిన వ్యూహంపై శుక్రవారం పర్చూరులో కీలక సమావేశం జరగనున్నది. నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ తన పరిధిలోని ఆరు మండలాల నేతలను, ముఖ్యులను ఈ సమావేశానికి పిలిపిస్తున్నారు. మండలాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా శ్యాం ప్రసాద్ రెడ్డి గెలుపునకు మార్గం సుగమం చేసే స్కెచ్ ని ఆమంచి అమలు చేయబోతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.