ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసర ప్రాంతాలను తరగతి గదులను సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన సంబంధిత అంశాలను విద్యార్థుల వద్ద అడిగి తెలుసుకున్నారు. అలానే మధ్యాహ్నం పూట విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయం మెనూ పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు అన్ని సక్రమంగా అందేలా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.