భూగర్భ జలాలు అడుగంటి రోజురోజుకు వేసవి తాపం పెరగడంతో వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఎంతో వెనుకబడిన ప్రాంతమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో నిన్న మొన్నటి వరకు మిరప, పత్తి, కంది పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడక తప్పలేదు. ప్రస్తుతం బొప్పాయి పంటలు కాపు దశలో ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు రైతాంగం నానా అవస్థలు పడుతున్నారు. టాంకర్ల ద్వారా పొలాలకు నీరు తోలకం. ముఖ్యంగా నీటి వసతి లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా రోజుకు సుమారు 1000 నుంచి 1500 ఖర్చుపెట్టి నీటి తడులను తడుపుతున్నట్లు రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం మండలంలోని అమాని గుడిపాడు గ్రామంలో సాగు చేసిన బొప్పాయి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని పట్టుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇలాంటివి నియోజకవర్గ పరిధిలో కనిపిస్తూనే ఉంటాయి. వెలుగొండ కోసం ఎదురుచూపులు. ఎన్నో ఏళ్లుగా వెలుగొండ వస్తది రైతుల కష్టాలు తీరుతాయని భావించిన రైతంగానికి ప్రతి ఏట నిరాసే మిగులుతుంది. ప్రతి ఏడాది మొదట నెలలో (నవంబర్) పూర్తవుతుందని, ఏడాది చివరిలో (జనవరి, ఫిబ్రవరి) మొదట పూర్తవుతుందని రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప అది పూర్తిచేసి నీరు అందించడంలో మాత్రం అధికారులు, నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఎన్నాళ్లు ఈ బాధలు అంటూ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.