కర్నూలు జిల్లా, కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అనుచరుడు బలరాం విలేఖరి సతీష్‌పై గురువారం సాయంత్రం దాడి చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గతంలో అక్రమ ఇసుక రవాణాపై ఫొటోలు తీసి ప్రశ్నించారు. ఈ విషయాన్ని మనస్సులో పగ పెంచుకొన్న ఎమ్మెల్యే అనుచరుడు బలరాం తనపై దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. గాయపడిన సతీష్‌ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కోడుమూరు ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.