ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 02:32 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికారం చేపట్టబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సొమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో పత్తికొండ టీడీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......  రాష్ట్రంలో జగన్‌ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అయితే తిరిగి అధికారం కోసం వైసీపీ అరాచకాలకు తెగపడుతూ ఉందన్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ గెలుపు కోసం నాయకులను మొదలుకుని క్షేత్రస్థాయి నాయకుల వరకు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు బత్తిన వెంకటరాముడు, మనోహర్‌చౌదరి, నాగేంద్ర, అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com