పోలీసులపై టీడీపీ యుద్ధం చేస్తోందని కొందరు ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతో చట్టవిరుద్థంగా పనిచేసే అధికారుల్ని మాత్రమే తాము నిలదీస్తున్నామని తెలిపారు. పోలీస్ యూనిఫామ్ గర్వంగా, గౌరవంగా పనిచేసేలా చేసింది చంద్రబాబే అని గుర్తుంచుకోవాలన్నారు. పాఠశాలలో గంజాయి దొరికిన ఘటనపై పోలీస్ శాఖను లోకేష్ నిలదీయడం తప్పా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఎస్పీకి పాఠశాలలో దొరికిన గంజాయి ప్యాకెట్లు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు కనిపించలేదా అని ఎమ్మెల్యే నిలదీశారు.