త్వరలో నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ సంభందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామన్నారు. శ్రీవాణి భక్తులకు తిరుమలలోని ఏటీజీహెచ్, ఎస్ఎన్జీహెచ్ అతిధి గృహల్లోని 88 గదులను కేటాయిస్తామని... కాషన్ డిపాజిట్ విధానంపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ నుండి తిరుమలలో ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.