పూణేలో అమిత్ ఛబ్రా అనే వ్యక్తి తను పనిచేస్తున్న కంపెనీలో ప్రమోషన్ కోసం అసహ్యించుకునేలా ఒక పని చేసాడు. అతను తన భార్యతో ఒక రాత్రి తన బాస్ తో గడపాలని ఒత్తిడి చేశాడు. బాస్ వద్దకు వెళితే ప్రమోషన్, ఇతర సౌకర్యాలు లభిస్తాయని ఛబ్రా భార్యను బలవంతం చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. బాస్ తో సమయం గడపాలని భర్త బలవంతం చేస్తున్నాడని, తన మరిది కూడా తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.తాను ప్రతిఘటిస్తే తీవ్రంగా కొట్టేవారని చెప్పింది.