గన్నవరం కేసులో తెలుగుదేశం జాతీయ ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం ఘటనలో పట్టాభి తదితరులకు కూడా బెయిల్ మంజూరైంది.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు పలు షరతులు విధించింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని స్పష్టం చేశారు. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది.