ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసు నుంచి తనను తప్పించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల చార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలని వైవీ సుబ్బారెడ్డి కోర్టును కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను ఈ కేసులో ఇరికించారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇందు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి ప్రభుత్వం 70 ఎకరాల భూమిని కేటాయిస్తే, గచ్చిబౌలిలోని ఇందూ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్‌లో 50 శాతం వాటాను వైవీ సుబ్బారెడ్డి పేరు మీద బదిలీ చేసిందని సీబీఐ ఆరోపిస్తోంది. కానీ వైవీ సుబ్బారెడ్డి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు కాబట్టే తన పేరును ఈ కేసులో చేర్చారని అంటున్నారు.