స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 59,809కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 17,594 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ రంగ, బ్యాంకింగ్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.11%), భారతీ ఎయిర్‌టెల్ (3.30%), రిలయన్స్ (2.46%), ఐటీసీ (2.42%), టాటా స్టీల్ (2.20%).
టాప్ లూజర్స్ : టెక్ మహీంద్రా (-2.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.04%), నెస్లే ఇండియా (-0.17%), ఏషియన్ పెయింట్స్ (-0.17%)