కౌతాళం: రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని శుక్రవారం ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కౌతాళం మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. దాడులకు నిరసనగా నినాదాలు చేశారు. కోడుమూరులో ఇసుక దందాపై వార్తలు రాసిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి సతీష్ పై అధికార పార్టీ నాయకులు బలరాం చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. తక్షణమే బలరాంను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.