కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జోడో యాత్రలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. యాత్రలో ఉగ్రవాదుల ముప్పు ఉందని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారని, అయినా ముందుకెళ్లానని తెలిపారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి నిజంగానే జమ్ముకశ్మీర్ ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడిగాడని, కొంతమందిని చూపిస్తూ 'వాళ్లంతా ఉగ్రవాదులు' అని చెప్పాడన్నారు. 'ఆ టెర్రరిస్టులు నన్ను చంపేస్తారనుకున్నా కానీ అలా జరగలేదు' అని తెలిపారు.