గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకంలో ఫిబ్రవరి నెలకు సంబంధించి 97 శాతం మంది లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసినట్లు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ హరిహర నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు 2, 46, 548 మందికి రూ. 67. 73 కోట్లను వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది అందజేశారని ఆయన వివరించారు.