నరసరావుపేట: జిల్లా స్థాయిలో మైనింగ్ కార్యకలాపాలపై శనివారం నరసరావుపేట కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమావేశం జరగనుంది. పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని కొన్ని పత్రికలతో వచ్చిన కథనాలతో పాటు, అధికారులకు అందిన ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ ను కట్టడి చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.