చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకు చెందిన ఏటీఎం యంత్రాల్లోని 35 లక్షలు మాయమయ్యాయని గుంటూరులోని అరండల్ పేట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. బ్రాడీపేట, పలకలూరు రోడ్డు, మంగళగిరి రోడ్డు, పాత గుంటూరు తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి ఓ గ్యాంగ్ చాకచక్యంగా నగదు డ్రా చేసుకుపోయిందని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఐటి విభాగం మేనేజర్ వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.