గురజాల మండలం దాచేపల్లి నగర పంచాయతీలోని గుంటూరు రోడ్డులో లారీ ఆఫీస్ లో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను సీఐ బిలాలుద్దీన్ శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 10, 875 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచున్నట్లుగా ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.