తాడికొండ నియోజకవర్గంలోని గరికపాడు, పణిధరం గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రాత్రి తాడికొండ నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ని కలసి తాము ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా శ్రీ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి కలసి 45 నిమిషాలు చర్చించానని, సాగునీటి సమస్య పరిష్కారానికి మార్గం సుగమనం అయ్యిందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు అని వారికి భరోసా ఇచ్చారు.