ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. తెనాలికి చెందిన నెలకుర్తి త్రివేణి అనే మహిళ ఆన్లైన్ మోసం బారిన పడి రూ. 4. 75 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా మోసగాళ్లు కొట్టేసిన డబ్బులో రూ. 2. 55 లక్షలు తిరిగి ఆమె ఖాతాకు గుంటూరు జిల్లా పోలీసులు రప్పించగలిగారు. శుక్రవారం బాధితురాలు ఎస్పీ కు కృతజ్ఞతలు తెలిపారు.