శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని రాంబట్లపల్లెలో కోడిపందేల స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. రహస్య సమాచారం మేరకు కోడి పందేల స్థావరం పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు కోడి పందేలరాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa