వలేటివారిపాలెం: మహిమాన్విత నరసింహుని దివ్యక్షేత్రం శనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు. శనివారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మాలకొండలో కేవలం ఒక్క శనివారం మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. మిగిలిన రోజులలో ఆలయ తలుపులు మూసి ఉంటాయి. స్వామి వారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంగా విశ్వసిస్తున్నారు.