హోం గార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రాథమిక రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలంది. కాగా కానిస్టేబుల్ నియామకాల్లో తమను ప్రత్యేక క్యాటగిరీగా పనరిగణించక పోవడాన్ని సవాలు చేస్తూ పలువురు హోంగార్డు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.