గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని విద్యానగర్ ప్రాంతంలో వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతం వారం రోజుల నుంచి ముందస్తు ప్రకటనలు లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందు పరిస్థితి మరి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనిపై విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని శుక్ర స్థానికులు కోరుతున్నారు.