ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టుబడులకు కారణం జగన్‌ బ్రాండ్ ఇమేజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 10:20 AM

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ చూసి వచ్చిన పెట్టుబడులు ఇవి అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక వద్ద శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబానీ, అదాని, జిందాల్, ఒబెరాయ్, జిఎంఆర్, కృష్ణ ఎల్లా, భజంగా వంటి పారిశ్రామిక ప్రముఖులు రాష్ట్రంలో పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను గురించి ఎంత పాజిటివ్ గా మాట్లాడారు తెలుగు ప్రజలంతా చూశారని, ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందని ప్రశ్నించారు. కరోనా సమయాన్ని కూడా తట్టుకొని, నిర్ణీత సమయం కన్నా ముందే ఏ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏ విధంగా చొరవ తీసుకుందో పారిశ్రామికవేత్తలు చెప్పిన మాటలు కూడా కళ్ళు ఉండి చూడలేని, నోరు ఉండి మాట్లాడలేని వారికి ఏం చెబుతామని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.


జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని సహజ వనరులను, వర్క్ ఫోర్స్ ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారని ఆయన చెప్పారు. 14 సెక్టర్లలో పెట్టుబడులు వస్తాయని ఆశించామని, అవి 20 వరకు పెరగటం తమకు మరింత ఆనందంగా ఉందని అమర్నాథ్ చెప్పారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి ఘనతగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం వచ్చిన ఈ పెట్టుబడులలో కనీసం 90 శాతం గ్రౌండ్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఒక్కో పరిశ్రమకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, పెట్టుబడులు కార్యరూపం దాల్చిన చూడాలని సీఎం గట్టిగా చెప్పారని ఆయన అన్నారు.


పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సు విజయవంతంగా జరుగుతున్నా. కొంతమంది దీనిపై విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయటానికి అచ్చం నాయుడు ప్రయత్నిస్తున్నారని నేటి సదస్సుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులను వారు ఎప్పుడైనా చూసారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com