జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఎమ్మిగనూరులో శుక్రవారం విస్తృతంగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు బరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ఎమ్మిగనూరు అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పరిశీ లించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మండల తహశీల్దార్ బి. జయన్న, మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి తదితరులు తది తరులు పాల్గొన్నారు.