కోవెలకుంట్ల పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్లో మేనేజర్ చిన్నబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. థియేటర్లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన నాయకులు పత్తి సురేష్ బాబు, బాల గుర్రప్పు, నాగ ప్రసాద్, ఓబులేసు, విజయ్, మాబు, స్వామిరెడ్డి, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.