మనం బయటకు వెళ్లినా, పొలాల్లోనూ పాములు చూస్తుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం పాములు కొన్ని విధాలుగా కంటపడితే అదృష్టమని పండితులు చెబుతున్నారు. పాములు మన పక్కగా కుడివైపు నుంచి వెళ్తే ఊహించని లాభాలుంటాయట. అవి చెట్టు ఎక్కుతున్నప్పుడు కానీ, గోడ పైకి ఎక్కడం దిగడం కానీ కంటపడితే ఉన్నత స్థానానికి వెళ్తామట. అలాగే చచ్చిన పాము, 2 పాములు కలిసి ఉన్నప్పుడు చూస్తే చెడు సంకేతమని అంటున్నారు.