దీర్ఘకాలికంగా తలనొప్పి వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగినా, గోరువెచ్చని పాలు తాగినా తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు. గంధం పౌడర్ పేస్టులా చేసుకుని తలకు రాసుకున్నా, అల్లాన్ని నమిలినా నొప్పి తగ్గుతుందంటున్నారు. రోజూ 2, 3 లీటర్ల నీరు తాగాలని, యోగా, సకాలంలో నిద్ర చేయాలంటున్నారు.